1st-October||విశ్వాసమే విజయం-viswasamey vijayam||Telugu Daily Devotions

1st-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-1

దేవుని కొరకై సృష్టింపబడెను

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రీ, నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై యుండవలెనని....... ( యోహాను 17:20,21 )

       మనము క్రీస్తునందు, క్రీస్తు దేవునియందు ఉండినయెడల మమమంతా ఏకమైయున్నాము. అలాంటి ఏకత్వాన్ని కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. నీవు ప్రేమయందు ఎదుగుచున్నావా? నీ పిల్లలు సంతోషముగా ఉండాలని నీవు కోరుచున్నావా? నీవు సంతోషముగా ఉండనియెడల వారెలా సంతోషముగా ఉంటారు? 

                దేవునిని బట్టి నీవు సిగ్గుపడితే నీ అవసరతలో ఆయన నిన్ను బట్టి సిగ్గుపడును. నీ స్వంత హృదయమే దేవుడు నీకు సహాయము చేస్తాడని నమ్మదు. నీవు దేవునిని విశ్వాసముతో వేడుకొనగలవా? అట్టి విశ్వాసములో నీవు ఎదగాలనుకుంటున్నావా? 

            దేవుని పిల్లలు తమకున్నదంతా ఇవ్వడానికి సిద్ధముగా ఉంటారు. ఏ బంధువు ఇంటికి వెళ్లినా వారికి కలిగిన కలిమిని చూడక  "అయ్యో! ఇక్కడ దేవుని భయము లేదే, కుటుంబ ప్రార్ధన లేదే"  అని దుఃఖపడతారు. మూలన కూర్చొని  "ప్రభువా, ఈ కుటుంబములోనికి రమ్ము. ఈ కుటుంబానికి అన్నీ ఉన్నా, నీవిక్కడ లేని స్థితిలో నశించుచున్నారు"  అని ప్రేమతో ప్రార్థిస్తారు.

        లాజరు ఇంటికి యేసు వెళ్లినప్పుడక్కడ ఆయనను ఆహ్వానించేంత విశ్వాసముండినది. సహోదరిలలో ఒకరిని యేసు గద్దించి, వాక్యాన్ని అనుగ్రహించుట వలన వారు ప్రేమలోను, విశ్వాసములోను ఎదిగిరి. వారు ప్రేమలో నిలిచియుండుటవలన మరణము కొట్టివేయబడినది. ఆయన ప్రేమలో నిలిచియుంటే ఆత్మీయ మరణమును బట్టి హెచ్చరింపబడుదురు. నీలోను, నీ ఇంటిలోను దేవుడు నివసించునట్లు కోరుచున్నాడు. మరి ఆయన నివసించునట్లు సిద్ధపరచాలి. తాను మనలో నివసించాలని తన శక్తిని ఇవ్వాలని తన కొరకు మనలను సృష్టించాడు. 

           లాజరు యొక్క సమాధి యెదుట యేసు ప్రేమయందు నిలిచియుండుట వలన సృజనాత్మక శక్తి విడుదల అయి  లాజరును బ్రతికించెను. ఆయన శిష్యులకు క్రీస్తు తన ప్రేమను చాటించెను. పరలోక శక్తి వలన నోటివాక్యాలకు కూడ శక్తి వస్తుంది. ఎవరైనా ముట్టుకుంటే ఒక మంత్రము వలె పని చేస్తుంది. ఆశీర్వాద వలయం ప్రేమయందు ఎదుగుట వలన విస్తరిస్తుంది. దేవుని ప్రేమ నిన్ను ఆయన మెట్టుకు ఎదుగునట్లు చేయును. ఆ మెట్టు నీవు ఊహించలేవు. నీవు దేవుని కొరకే సృష్టింపబడినావని గ్రహించి ఆయన ప్రేమలో నిలిచియుంటే ఆయనలో నిలిచియుండడానికై  నీ ప్రేమను ఆయన కోరుచున్నాడు.

                                 ~యన్.  దానియేలు