10th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

10th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spiritual Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org, ninth October,

Laymen's Evangelical fellowship-Lefi. org, Telugu Christian  Devotions

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-10

  అంశమూ: పాళెములోని వారు  - వెలుపలి  తేరి చూచువారు

"​​అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి" (2రాజులు 4: 21)

                 షూనేమీయురాలి కుమారుడు మరణించాడు. ఇంతవరకు తల్లిదండ్రులను బంధువులను సంతోషపెట్టిన కుమారుడిప్పుడు చనిపోయాడు. ఎలీషా మంచము  మీద పరుండ బెట్ట బడ్డాడు. ఎలీషా మంచము మీద పెట్టబడుట ఆశీర్వాదకరమే కానీ అది జీవము కాదు. కాని అది జీవములోనికి తేగలదు. ఎలీషా మంచము మీద పరుండి ఉన్న బిడ్డలో జీవము లేదు. శరీరము వెచ్చగా లేదు. ఆ విధంగానే నీవు ఎలీషా మంచము మీద పరుండి ఉన్నావు కానీ చనిపోయిన స్థితిలో ఉన్నావు. కొంచెము వెచ్చదనం, కొంచెము నీతి, కొంచెము ప్రేమ, సేవ నీలో ఉన్నాయేమో! సాధారణ మానవులందరిలోనూ అవి ఉంటాయి. నీలో జీవాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఎందువలన లేకున్నది? నీలో జీవము లేదు.

              ఇక్కడ షూనేమీయురాలు సజీవంగా ఉన్నది. తన కుమారుడు చనిపోయెను. అది చూచి ఏమి జరిగిందో గ్రహించినది. తన గృహము యొక్క జీవము పోయెనని గ్రహించినది  అతనిని పాతిపెట్టవలసి ఉన్నది. క్రీస్తు లేని మన జీవితాలు పాతి పెట్టబడుటకె తగినవి.

                దేవుని వేడి కలిగినవాడు ప్రార్థించి తన కుమారుని విడిచిపోయిన ఆత్మను తిరిగి తేగలడు అని ఆమె వెళ్ళుచున్నది. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనికి సేవకుడున్నాడు. ఆ సేవకుడు ఏమి చేయలేడు. అయినా యజమానుడు అతనిని పిలిచి తన కర్రను ఇచ్చి పంపాడు. అతడు పరిగెత్తి వెళ్లి ఆ కర్రను ఆ పిల్లవానిపై ఉంచాడు. ఏమీ జరగలేదు. ఆ కుటుంబమువారు దైవజనుని ఆవశ్యకతను గుర్తించారు. కనుకనే ఆయనను వారి గృహంలో ఉండనిచ్చారు. దైవజనుని రాక వారిలో విశ్వాసాన్ని కలిగించింది. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమైనను విశ్వాసముతో తిరిగి బ్రతుకుదుము.

                 కర్మేలు పర్వతము నుండి ఎలీషా వచ్చాడు. అక్కడ ఆయన దేవుని సన్నిధి కలిగియున్నాడు. దేవుని జీవముతో నిండి యుండుట వలన ఈ మరణమును గూర్చి వినినప్పుడు ఒక్కసారిగా కదిలించబడ్డాడు. దేవుని పిల్లలు ఆ విధంగా ఉంటారు. సింహాసనము నుండి  దేవుడు చూచినప్పుడు మనము చచ్చి పడియున్నట్లు కనిపిస్తాము. నీవు ఎలీషా మంచము మీద పరుండి ఉండవచ్చు. ఆరాధనా స్థలములో ఉండాలనే వాంఛ నీలో ఉండవచ్చు. చాలామంది మేల్కొనిన పాపులుగా ఉన్నారు. అది మాత్రమే క్రైస్తవత్వము కాదు. నీలో జీవమున్నదా?
             

                       ~యన్. దానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs