3rd-October||విశ్వాసమే విజయం-viswasamey vijayam||Telugu Daily Devotions

3rd-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-2

విధేయతతో అడుగులు వేయుట

నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానిని బట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు నిరీక్షణకు  ఆధారము లేనప్పుడు ఆతడు నిరీక్షణ కలిగి నమ్మెను.  ( రోమా 4:18 )


             నిరీక్షణాధారము లేనప్పుడు అబ్రాహాము నమ్మెను. ఒకచోట ఆగిపోయిన రైలు బండిలో నేనున్నాను. ఆ రైలు ఇంజనులో నీరు తగినంత లేకపోవుట వలన ఆవిరి సరిపోక కదలక పోయినది. ఈ రోజులలో ప్రతివారు తమకు విశ్వాసమున్నదని చాటుదురు. క్రియలలో చూపగలిగినంత  విశ్వాసమున్నదా? 

              అబ్రాహాము యొక్క విశ్వాసము వృద్ధిచెందే విశ్వాసము గనుక దేవుడు  ఆ విశ్వాసమును ఘనపరిచాడు. దేవుడతనిని పిలిచినప్పుడతడు తన పితరుల విగ్రహారాధన దేశము నుండి బయలు వెళ్ళాడు. అతడు వేసిన ప్రతి అడుగు విశ్వాసపుటడుగు. అతడు వాగ్ధాన దేశానికి చేరినప్పుడు అతని విశ్వాసము చాలా తక్కువగా ఉండినది. అతడు చాలా ధనికుడు.  ఈ స్థలానికి రావడానికి 600 మైళ్ళు ప్రయాణము చేశాడు. దానిని బట్టి దేవుడు సంతోషించి అతని కుటుంబాన్ని దీవిస్తానని చెప్పాడు. అతనికప్పటికి స్వంత కుటుంబము లేదు. లోతు ఇంకా అబ్రాహాముతోనే  ఉంటూ అతని విశ్వాసపు దీవెనలన్నీ  పొందినాడు గాని వ్యక్తిగతంగా అతడు దేవునితో సాన్నిహిత్యాన్ని పొందలేదు. లోకాన్ని ప్రేమించేవాడు గనుక నాశనము పొందక ముందు ఎంతో  రమ్యముగా నున్న ప్రదేశాన్ని లోతు ఎన్నుకున్నాడు.

             అబ్రాహాము సొదొమ ధనమును తిరస్కరించాడు. దాన్ని తీసుకొని ఉంటే అతని విశ్వాసము పోయేది. ఆ రాజు సరియైన కట్టడలను అనుసరించే వాడుకాదు. గనుక ఆ ధనము పాపపు ధనము. దేవునికి విధేయుడై  అబ్రాహాము దానిని తిరస్కరించాడు. అబ్రాహాము దేవుని నమ్మి ఆయనతో నడిచెను. అబ్రాహాము దేవుని నమ్మెను. ఆ నమ్మిక యొక్క శక్తి క్రియారూపము దాల్చి కుమారుని పొందునట్లు చేసింది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రాహాముతో  "నా సన్నిధిని నిందారహితుడవుగా ఉండు"  అని అన్నాడు. అబ్రాహాము యొక్క విశ్వాసము దేవునికి నీతిగా ఎంచబడెను.

               విధేయతతో వేసే ప్రతి అడుగు దీవెనకరముగా ఉంటుంది. విశ్వాసమును కోల్పోవద్దు. ప్రతి సాయంకాలమున యేసు తన తండ్రితో గడుపుతూ ఆ రోజంతటిలో  ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయలేదని, కపటము లేనివాడని నిర్ధారించుకొనేవాడు. లోతుగా ప్రార్ధనలో హృదయాన్ని తరచి చూచుకొని శుద్దీకరింపబడాలి.

                                 ~యన్. దానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs