4th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions
4th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org
Download Pdf | Download .MP3 Voice |
విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion
విశ్వాసమే విజయము-అక్టోబర్- 4
మేల్కొల్పబడిన మనసాక్షి
"రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. -మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి" (2రాజులు 22: 11,13)
దైవభక్తి గల ఒక రాజును గూర్చి చదువుతున్నాము. అతడు ఎనిమిది ఏండ్లువాడై సింహాసనమును ఎక్కెను. దేశంలో హెచ్చుగా విగ్రహారాధన ఉండేది. విగ్రహారాధన అంటే మనస్సాక్షిని చంపుకొనుటయే. మృతమైన మనస్సాక్షి కలవారే కులమును ప్రోత్సహిస్తారు. ధర్మశాస్త్రము రాజు మనసాక్షిపైనను అతని ప్రజలపైనను ప్రభావం చూపినది. ప్రతి కుటుంబం దేవుని వాక్యాన్ని కలిగియుండాలి. వాక్యానికి విరుధ్ధమైన అనేక ఆచారాలు కుటుంబాలలోనికి వచ్చి చేరాయి. దేవుని వాక్యము మనలను శుద్ధికరించినట్లు మనము అనుమతించాలి. యోషీయా దైవజనురాలి సలహా తీసుకున్నాడు. దేశపు మనస్సాక్షిని శుద్ధి చేసే వారే నిజమైన దేశ నాయకులు. మరియు కర్ణపిశాచి గలవారిని ... యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న .... (2రాజులు 23: 24)
పొరుగువారి మనస్సాక్షిని శుద్ధి చేసి స్థిరపరచుటకు ధర్మశాస్త్రముననుసరించాలి. మనము పశ్చాత్తాప పడాలి. మన దేశ జనుల పాపము కొరకు మనము ప్రార్థించాలి. లేకపోతే వారి ప్రభావము మన మీద పడుతుంది. దాని నుండి తప్పించుకోలేరు. మన మనస్సాక్షి చైతన్యవంతము కావలసియున్నది. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను. (2రాజులు 23: 26)
ఇక్కడ మరొక సత్యమున్నది. మనష్షే ఎంతో పాపము చేసినందువల్ల దేశపు వారి మీదనే పాపపు ప్రభావముండినది. వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు ... తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల, (లేవీయకాండము 26: 41)
మనము మన తండ్రుల దోషము మనమీద ఉన్నదని గ్రహించి పశ్చాత్తాపపడాలి. నాయకులు చేసిన పాపమును కప్పిపుచ్చుకుని పైకి నటిస్తున్నారు. వారి పాప ప్రభావము సంఘముపైన ఉంటుంది. దానిని పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలి. తెల్లవారుజామున లేచి కుటుంబంలోని వారి కొరకు, సంఘములోని వారి కొరకు పాపములను ఒప్పుకుంటూ ప్రార్ధన చేయాలి. అదే గొప్ప సేవయై యున్నది.
~ జాషువా డానియేలు
for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org
Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs