5th-October||విశ్వాసమే విజయం-viswasamey vijayam||Telugu Daily Devotions

5th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-5

 దేవుడు పరీక్షించు బల్ల

   "​వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును."  (యెషయా 56:6,7)

               ఒకరిని తనకు అంగీకారంగా నుండునట్లు దేవుడు వారిని ఆయన మందిరములోనికి  నడిపిస్తాడు. ప్రార్ధించినప్పుడు ఆయన మన వ్యక్తిత్వాన్ని గమనించి చూస్తాడు. ఒకసారి ఒక హైకోర్టు జడ్జి గారు లాయరు మాటలను వినిపించుకొనక లాయరువైపే గమనించుట వల్ల ఆ లాయరు  ఆశ్చర్యపడ్డాడు. తన వస్త్రములను చూసుకున్నప్పుడు కాలరు లేనట్లు గుర్తించాడు. న్యాయస్థానంలోని గౌరవ, మర్యాదలను కాపాడాలి. ఇష్టము వచ్చిన వస్త్రములు  వేసుకోనకూడదు. న్యాయస్థానములోని పద్ధతి ప్రకారం వస్త్రాలు వేయవలెను. దేవుని మందిరమునందు కూడా ఒక పద్ధతి ఉంటుంది.

                   ప్రార్ధించినప్పుడు పెదవులతో పలుకుతూ కన్నులతో కూడా ఉచ్చేరించే పరిస్థితిని దేవుడు గమనిస్తుంటారు. అంటే కన్నులతో అటూ ఇటూ చూస్తూ ప్రార్ధించుట అన్నమాట. మనము ద్వంద మనస్కులుగా, ద్వంద వ్యక్తిత్వముతో ఉండకూడదు. నిజ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ఉద్దేశాలతో పాటు మన ప్రాణ ఆత్మల స్థితి ఆయన పరీక్షించును.

                ద్వంద మనస్సులలో మోసపు ఆత్మ ఉంటుంది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు శరీరమును, మనస్సును, ఆత్మను పరీక్షిస్తారు. శరీరానికి, ఆత్మకు అంటిన పవిత్రత నుండి విడుదల పొందాలని ఆయన కోరుతాడు. ప్రార్థన మందిరంలో ఆనందింప చేయాలని కోరుతాడు. ఏలియా, యెషయా, దానియేలు మరియు పౌలు వలె తిన్నగా చేయబడి కట్టబడతారు.

               మన ప్రార్థనలతో దేవుడు మోసగించబడడు. మన పొరపాట్లు ఆయనకు తెలుసు.  దేవుని వాక్యము నీతిని కలుగజేస్తుంది. నీతి సంపూర్ణ అదుపులో మనలను ఉంచుతుంది. మన తలంపులు అదుపు చేయబడతాయి. సరికొత్త అవగాహనము దేవుని వాక్యము ఇస్తుంది. సిలువ ప్రభావము పూర్తిగా కలిగిన జీవ వాక్యముతో తృప్తిపరచబడతారు. దేవుని సన్నిధిలో పూర్తి వ్యక్తిత్వం తేటగా కనబడుతుంది. నా జీవితంలోని ప్రతి కార్యము దేవుని సూచనల ప్రకారం చేశాను. కనుక ఎల్లప్పుడూ సురక్షితంగా, యదార్థంగా ఉండగలను. అదే భావంతోనే గుడికి వెళ్ళేవాడను. ఆత్మ అధీనంలోనే అన్నియు క్రమపరచబడతాయి. దేవుని వాక్యానికి లోబడి, ఆయన నీపై పనిచేయునట్లు అనుమతిస్తే తప్పక ఆయన నిన్ను వాడుకుంటారు.
             

                       ~యన్. దానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs