6th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

6th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-6

 క్రొత్త నిబంధన

వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను. వారి హృదయము మీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు. ( యిర్మీయా 31:33,34 )

                "నా ధర్మవిధి మీ హృదయములలో వ్రాసెదను"  అని దేవుడు సెలవిస్తే అది స్వంత గొప్పలాగా తలంచకూడదు. ఇది రక్తము ద్వారా చేయబడిన నిబంధన. రొట్టె విరిచి ద్రాక్షారసము ఇవ్వక ముందు  "ఇది నా రక్తము; అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము"  అని యేసు చెప్పెను. 

           నిబంధన అనునది ఇద్దరి మధ్య అనగా దేవునికి, నీకు మధ్య జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తానే చిందించిన రక్తము ద్వారా ఇది జరిగినది. అది ముద్ర. ఈ నిబంధన యొక్క అంతిమ ముద్ర. ఆయన రక్తములో పాలు పొందునప్పుడెల్లా అది ఎంతో విలువైనదని గుర్తు చేసుకోవాలి. అది చౌకరకపు నిబంధన కాదు. అది వాడబారునది కాదు. అది యేసు రక్తము ద్వారా ముద్ర వేయబడిన నిబంధన. అంతకుముందు అబద్దాలు చెప్పేవాడివైనప్పటికిని ఈ నూతన నిబంధన చేసుకొన్న తర్వాత అబద్దాలు మాట్లాడలేవు. పాతవి గతించెను. అన్నియు క్రొత్తవి ఆయెను.  "నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాయుదును" (హెబ్రీ 10:16 )

          "నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు"  అని దావీదు చెప్పుచున్నాడు. అతని తలంపులు ఎక్కడ నుండి మొదలవుతాయో అది అతనికి తెలుసు. అతని అంతరంగములో వ్యభిచారము, నరహత్య ఉన్నట్లును, సత్యము లేనట్లును గమనించినప్పుడు దేవునికి ఏడుస్తూ మొరపెట్టుచున్నాడు. మన అంతరంగమున దేవుడు ఆయన ధర్మవిధులను వ్రాయును. కనుక ఎవరును నిరుత్సాహపడరాదు. మనము ఆయన నిబంధనను ఉల్లంఘించినప్పుడు మన ఆత్మలకు ఎంతో తీవ్రమైన గాయం కలుగుతుంది. అయితే యేసురక్తములో కడుగబడితే మనం క్రొత్త నిబంధనలోనికి వస్తాము. ఈ నిబంధన మన వెలుపల నున్నది కాదు. 

         పర్వతము మీద పాత నిబంధన ఇవ్వబడినప్పుడు ఇశ్రాయేలీయులు పర్వత సమీపమునకు రాలేకపోయారు. కొండ అంచు ముట్టుకోడానికి కూడ వారికి అనుమతి ఇవ్వబడలేదు. వారు ఆ నిబంధనలో దూరంగా ఉండి పాల్గొన్నారు. అయితే ఈ క్రొత్త నిబంధన వ్యక్తిగతమైనది. నీ తండ్రి నీ కొరకు ఆ నిబంధన చేయలేడు. యేసు యొద్దకు వెళ్లి ఆయన రక్తము క్రిందకు నీవు వచ్చినప్పుడు ఆయన తన క్రొత్త నామమును నీ హృదయముపై వ్రాయును. ఆయన తన ధర్మవిధులను నీ అంతరంగములో వ్రాయును.          

              ~ జాషువా డానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs