7th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

7th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spirutuval Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-7

విశ్వాస ఖడ్గము

 "​దావీదు ఫిలిష్తీయునికంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను."  (1 సమూయేలు 17:50)

               ఇది ప్రాణాలను పణముగా పెట్టి చేసిన ఒక క్లిష్టమైన యుద్ధము. దావీదుకు ఖడ్గము లేకుండుట విచిత్రముగా నున్నది. ఎక్కడను ఇలాంటి యుద్ధము జరిగియుండదు. సౌలు తన యుద్ధోపకరణములను దావీదుకు తొడిగించాడు, కానీ అవి అతనికి సరిపోలేదు. 
                     దావీదు చేతిలో కత్తి లేదు. అయితే అతని నోట దేవుని వాక్య ఖడ్గము ఉన్నది. సజీవుడైన దేవుని సైన్యమును గొల్యాతు తిరస్కరించాడు కనుక దావీదు అభ్యంతరపడ్డాడు. ఈ సున్నతి లేని  ఫిలిష్తీయుడు ఎవడు? అని అంటున్నాడు. అన్యులు మన దేవుని తిరస్కరించినప్పుడు మనకు ఈ విధమైన కోపం రావాలి. సింహమును ఎలుగుబంటియు వచ్చినప్పుడతని దగ్గర ఖడ్గములేకుండానే వాటిని చంపాడు.  ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒక దాని వలె అగును అని అన్నాడు. ఈ విశ్వాసం ఎక్కడ నుండి వచ్చినది? రూతు అను మోయాబీయురాలి నుండి దావీదుకు విశ్వాసము వచ్చినది. నయోమి జీవితాన్ని చూచినది గనుక తిరిగి నీ జనం వద్దకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె తన జనుల వద్దకు వెళ్లడానికి తిరస్కరించింది. నయోమి భర్త మరణించారు మరియు ఆమె ఇద్దరు కుమారులు మరణించారు. అయినప్పటికీ నయోమి దేవుని మీద విశ్వాసముంచినది. రూతు దానిని గమనించినది.

              విశ్వాసములో ఎంతో సౌందర్యం, ఆకర్షణ ఉన్నాయి. మన విశ్వాసముతో ఇతరులను ఆకర్షిస్తాము. నిరీక్షణ లేని పరిస్థితిలో క్రీస్తు ఇచ్చే నిరీక్షణ మనకు సహాయపడుతుంది. రూతు తల్లి అయినది. నయోమి నాయనమ్మ అయినది. విశ్వాసముంటే నిరీక్షణ లేని స్థితిలో కూడా నిరీక్షణ కల్గుతుంది.

               రూతు జీవితాన్ని తరచి చూస్తుండగా అనేక సత్యాలను నేర్చుకున్నాను. ఒక కుటుంబములో ప్రారంభించబడిన విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఒకరి నుండి మరొకరికి అందించబడుతూ అత్యున్నత మెట్టుకు చేరుతుంది. యెష్షయి యొక్క కడసారి కుమారునిగా దావీదు అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఇంటిలోని కడసారి వారు విషయాలు ఎలా నేర్చుకుంటారో మనకు తెలియదు. నేను కడసారి కుమారునిగా మా తల్లిదండ్రులతో పాటు కూటములకు వెళ్లి మధ్యరాత్రి వరకు కూర్చుని వినేవాడను. సరిగా అర్థం కాకపోయినా దేవుని వాక్యాన్ని విన్నాను. ఆ వాతావరణమంతా దైవ భయముతోను, దేవుని యెడల గౌరవముతోను నిండియుండేది. అవి మన విశ్వాసాభివృద్ధికి దోహదం చేస్తాయి.


                       ~యన్. దానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs