9th-October|విశ్వాసమే విజయం-viswasamey vijayam|Telugu Daily Devotions

9th-October, విశ్వాసమే విజయం-viswasamey vijayam, Faith is the Victory, Telugu-Daily Devotions by Laymen's Evangelical Fellowship, A Telugu Christian Spiritual Daily Devotion was written by Dr Joshuva Daniel, for more spiritual content please visit Lefi. org, ninth October,

Laymen's Evangelical fellowship-Lefi. org, Telugu Christian  Devotions

Download Pdf  Download .MP3 Voice

విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - Viswasamey Vijayam-Telugu Christian Devotion

విశ్వాసమే విజయము-అక్టోబర్-9

  అంశమూ: మేల్కొనిన పాపి

"​​అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి- ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది; నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని.." (2రాజులు 6: 1,2)

               ఒక నిజమైన దేవుని ప్రవక్త చుట్టూ అతని యొక్క భక్తి, ఆత్మీయ ప్రత్యక్షతననుభవించే శిష్యులు ఉండాలి. వారు నిజమైన వారు, పవిత్రులు,  స్వార్థరహితులు, నిందారహితులు, యౌవనస్తులు, క్రీస్తు కొరకు ఆయన మహిమ కొరకు ఆశక్తితో ఉన్నవారు. ఇలాంటి వారిని శిష్యులంటారు.

                     లోతు లేని స్వీయారాధికులు, దేవునితో నడచుట తెలియని వారు, ఒక బోధకుని చుట్టూ చేరి అతనిని పొగడుతూ భజన చేయువారిని చూసినప్పుడు ఎంతో నిరుత్సాహము కలుగుతుంది. గ్యాలరీలలోని వారు, తేరి చూచువారి వలె వీరు దైవజనునికి ఏ మేలును చేయరు. ఒక యంత్రము తిరగకుండా చేసే ములుకు వంటివారు గనుక అతని ఆత్మీయ ఎదుగుదల క్రమంగా తగ్గి చివరికు ఆగిపోతుంది.

             చాలమంది పరిపూర్ణత వైపుకు పోవడానికిగానీ, లోతైన విషయాలు తెలుసుకొనడానికికానీ ఇష్ట పడక పోవటం ఎంత ప్రమాదకరము! ఒక చోట ఆగిపోయే భక్తి అపాయకరము. ఆత్మీయంగా ఒకేచోట నిలువబడుట, మురిగిపోవుట అనునది శిష్యులకు తగదు. చిన్ని చిన్ని అలల వంటి సూక్ష్మమైన జయాలు చూచి తృప్తి పడిపోయి ఎంతో ప్రయాసపడినట్లు తలంచరాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట ఉండుట తన ఆత్మీయ స్థితిని ఎరగకుండా చేస్తుంది. మరుగుజ్జు కానంత మాత్రాన అతడు బలాఢ్యుడు కాదు. అట్లే కొద్ది భక్తికే ఆత్మీయ బలాఢ్యుడునిగా ఎంచుకొనకూడదు. ఎల్లప్పుడూ తనను తాను తప్పులెక్క వేసుకుంటూ ఒక ప్రక్కకు జారిపోవుట మానవ సహజ స్వభావము.

              ఇదిగో ఈ స్థలము యిరుకుగా ఉన్నది అని మొరపెట్టు వారేరి?  "ప్రభువా మారుమనసు పొందిన ఆత్మలు కొందరే ఎందులకు? లక్షల కొలది ఆత్మలను ఇవ్వవా?" అని అడిగేవారు కావాలి.

          తక్కువ విశ్వాసం ఉంటే తక్కువ ప్రత్యక్షత మాత్రమే ఉంటుంది. ఈ దినాలలో ప్రత్యక్షత, విశ్వాసము కలవారు చాలా తక్కువగా ఉన్నారు. డబ్బు రూపాయి విలువ తగ్గుట, ధరలు ఎక్కువగుట, వనరుల కొరత అను వీటిని గూర్చియే ప్రజలు మాట్లాడుచున్నారు. ఆత్మీయంగా ఇంకా చాలదు, అనునది దేవుని వైపు తిరిగిన వారికే అనిపించును. అస్థిరత, అపజయాలు, స్వార్ధపరత్వము, మరణకరమైన గుర్తింపు, లోతులేని స్థితి అను పూర్వపు పరిస్థితిని బట్టి దైవచిత్తానుసారమైన దుఃఖముతో పశ్చాత్తాపపడాలి.
             

                         ~జాషువా డానియేలు

for more Spirutuval Telugu Christian Devotions -Laymen's Evangelical Fellowship, Lefi. org

Telugu Christian Songs, Telugu Christian Website-Gospel Needs