మాథ్యూ హెన్రీ | Matthew Henry Biography

Matthew Henry" is a Christian biography and spiritual quest written in Telugu. This book recounts Matthew Henry's life narrative, focusing on the prophetic and spiritual components of his Bible notes. Many Christians benefit from this book's spiritual support and heartfelt guidance.

Apr 18, 2024 - 03:36
Apr 18, 2024 - 03:49
 0  6
మాథ్యూ హెన్రీ | Matthew Henry Biography
మాథ్యూ హెన్రీ | Matthew Henry Biography
మాథ్యూ హెన్రీ | Matthew Henry Biography

  1. మాథ్యూ హెన్రీ తెలుగు క్రైస్తవ బయోగ్రఫీ
  2. మాథ్యూ హెన్రీ ఆధ్యాత్మిక అన్వేషణ
  3. తెలుగులో మాథ్యూ హెన్రీ బైబిల్ నోటుల వివరణ
  4. క్రైస్తవ మందికి ఆధ్యాత్మిక మద్దతు
  5. మాథ్యూ హెన్రీ జీవిత కథనం
  6. తెలుగులో క్రైస్తవ జీవిత చరిత్రలు
  7. ఆధ్యాత్మిక అంశాలను ఆధారంగా మాథ్యూ హెన్రీ చరిత్ర
  8. మాథ్యూ హెన్రీ పుస్తకం అనుభవాలు
  9. తెలుగులో క్రైస్తవ బైబిల్ అభివ్యక్తి
  10. మాథ్యూ హెన్రీ పరిచయం చేసుకోవడం తెలుగులో

Matthew Henry's Commentary on the Bible Volume Set

• Matthew Henry's commentary on the entire Bible volume set is considered the best.
• The commentary discusses the importance of understanding the Bible and its teachings.
• The commentary emphasizes the importance of understanding the Bible in its entirety.
• The commentary also discusses the importance of understanding the Bible in its entirety.
• The commentary concludes by highlighting the importance of understanding the Bible in its entirety.

"Siri Aurobindo's Journey to the East"

• The journey from 1714 to 1715 was marked by significant changes in the course of history.
• The journey was marked by significant changes in the course of history, including the introduction of the concept of 'Siri Aurobindo'.

మాథ్యూ హెన్రీ బోధకుడు మరియు వేదాంత పండితుడు 

"This edition of Matthew Henry Commentary is unquestionably the best 

MATTHEW HENRY'S COMMENTARY ON THE WHOLE BIBLE VOLUME SET 

మాథ్యూ హెన్రీ బైబిల్ వ్యాఖ్యానము వ్రాసిన గ్రంధకర్త 

మాథ్యూ హెన్రీ జీవిత చరిత్ర 

1662 - 1714 బోధకుడు మరియు వేదాంత పండితుడు 

మాథ్యూ హెన్రీ అనగానే క్రైస్తవులలో అనేకులకు అతడు వ్రాసిన బైబిలు వ్యాఖ్యానము గుర్తుకొస్తుంది. కారణం, అతడు వ్రాసిన బైబిలు వ్యాఖ్యానము ప్రపంచ ప్రసిద్ధిగాంచడమే. శతాబ్దాలుగా ఆ వ్యాఖ్యానము అనేకమంది 

క్రైస్తవులకు బైబిలు సత్యాలను గ్రహించేందుకు గొప్ప సహాయకారిగా పనిచేస్తోందన్నది వాస్తవం. ఆ వ్యాఖ్యానము వెనుక హెన్రీ చేసిన విరామములేని కృషి ఉందనేది కూడ వాస్తవమే. కృపా గుర్తులు  

మాథ్యూ హెన్రీ 1662వ సంవత్సరంలో ప్రాప్ షైర్ లోని వైట్ చర్చికి దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉన్న బ్రాడ్ ఓక్ అనేచోట జన్మించాడు. అతడు ఫిలిప్ మరియు కేథరిన్ హెన్రీల రెండవ కుమారుడు. అతని తండ్రి వర్తన్ బరీ ప్యారిష్ లో ఒక అభి షేకము పొందిన మతాధికారిగా పనిచేసాడు. అయితే, లేఖనవిరుద్ధమైన చర్చి నియమ నిబంధనలకు ఇమడలేక అతడు 1662లో చర్చినుండి బయటకు వచ్చాడు. 

మాథ్యూ హెన్రీ క్రైస్తవ కుటుంబ క్రమశిక్షణలో పెంచబడ్డాడు. తన మూడవ ఏటనే అతడు బైబిలు గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. దేవునివాక్య సత్యాలను 

www.gospel needs.com 

నేర్చుకోవాలన్న అతనిలోని లోతైన తృష్ణ అతణ్ణి లోతైన బైబిలు పఠనలోనికి నడిపించింది. హెన్రీ కుటుంబంలో ఉదయ సాయంకాలాలలో క్రమంగా ప్రార్థనలు జరిగేవి. ఆ సమయాలలో 

అతని తండ్రి బైబిలు గ్రంథంలోని ఒక భాగాన్ని చదివి, దానిని కుటుంబసభ్యులకు విపులంగా వివరించేవాడు. ఆతర్వాత పిల్లలు తాము విన్న విషయాలను తమ స్వంత మాటలలో 

వ్రాసేందుకు ప్రోత్సహించ బడేవారు. ఈ ప్రక్రియ ఆతర్వాతికాలంలో మాథ్యూను ఒక గొప్ప వేదాంతపండితునిగా మార్చివేసింది. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తన 51:17) అనే www.gospel needs.com 

అంశంపై అతని తండ్రి చేసిన చిన్ని ప్రసంగము మాథ్యూ మనస్సును విరిగిన మనస్సుగాను, అతని హృదయాన్ని విరిగి నలిగిన హృదయముగాను మార్చివేసింది, క్రీస్తును గురించి మరెక్కువగా తెలుసుకోవాలన్న తృష్ణను 

అతనిలో మరింతగా అధికం చేసింది. 

ఆతర్వాతికాలంలో మాథ్యూ ఏకాంతంగా బైబిలు పఠించడంలో ప్రతిరోజూ గంటలతరబడి గడి పేవాడు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయాలలో కూడ అతడు తన బైబిలు పఠనను కొనసాగించేవాడు. తన పదేళ్ళ వయసులో అతడు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు తన ఆత్మీయ స్థితిని గురించి అతడు లోతుగా ఆలోచిస్తున్న www.gospel needs.com 

సమయంలో 1673 డిసెంబరు 7న 'దేవుని తీర్పును గురించి అతడు విన్న ఒక సందేశము అతని హృదయాన్ని లోతుగా కదిలించివేసింది. ఆ సందర్భాన్ని గురించి అతడు ఇలా వ్రాసాడు: “ఆ సమయంలో నేను నరకాన్ని గురించి గొప్పగా భయపడ్డాను. ప్రభువు నన్ను ఓదార్చే వరకు ఆ భయం నాలో కొనసాగుతూ వచ్చింది. 'నేను మరణిస్తే నేను ఎక్కడికెళతాను?” అన్న ప్రశ్న ఆ సమయంలో నన్ను తీవ్రంగా వేధించింది. ఆ సమయంలో నన్ను నేను లోతుగా పరీక్షించుకొన్నాను. నేను పాపినన్న వాస్తవాన్ని నేను గ్రహించాను. లోతైన 

పాపాలను క్షమించాడు. రక్షణ నిశ్చయతతోను, పరలోక నిరీక్షణతోను నేను నింపబడ్డాను. ఇప్పుడు నేను దేవుని బిడ్డనన్న నిరీక్షణ నాకు కలిగింది. ఇప్పుడు నేను మరణిస్తే, నేను పరలోకం వెళతానన్న నిశ్చయత నాకు కలిగింది. 

సంస్కరణ సమయంలో నాన్ కన్ఫర్మిస్టులను ఆక్స్ ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ 

యూనివర్సిటీలు వెలివేయడం వల్లను, ఆ సమయంలో యూనివర్సిటీలలో 

నెలకొనివుండిన అనైతిక జీవనవిధానాల వల్లను, 1680లో మాథ్యూ తండ్రి లండన్లోని ఐలింగ్టన్ లో ఉన్న ఒక “డి సెంటింగ్ 

అకాడమీ”లో చేరాడు. అయితే, అక్కడి ఆచార్యుడైన థామస్ డూలిటిల్ సామాజిక బహిష్కరణ కావించబడినందునను, అక్కడి పండితులు ఆయా ప్రాంతాలకు చెదరిపోయినందునను హెన్రీ తండ్రి అక్కడ కొద్దికాలం మాత్రమే కొనసాగాడు. 

పై కారణాల ఫలితంగా మాథ్యూ తన చదువును అనేక సంవత్సరాలు తన ఇంట్లోనే కొనసాగించాడు. ఆతర్వాత అతడు 1685లో 'గ్రేస్ ఇన్' అనేచోట న్యాయశాస్త్రం చదివేందుకు లండనకు వెళ్ళాడు. అయితే, ఆ చదువులో అతనికి ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో అతడు తీవ్రమైన అసంతృప్తికి గురై తన తండ్రికి ఇలా ఒక ఉత్తరం వ్రాసాడు: “ఈ లోక 

వ్యవహారాలను నేను లోతుగా గమనించినప్పుడు, అందులోని వ్యర్థతను నేను స్పష్టంగా చూసినప్పుడు, నా హృదయం వాటన్నిటినీ అమితంగా అసహ్యించు 

కొంటోంది. ఫలితంగా నా నేత్రాలు కనిపించని మరోవవంచంపై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి.” 

ఒక సంవత్సరం తర్వాత అతడు న్యాయశాస్త్ర చదువులకు స్వస్థిచెప్పి, బ్రాడ్ ఓక్ కు తిరిగొచ్చాడు. అక్కడ అతనికి జార్జ్ ఇల్లిడ్జ్ అనే ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. ఆ స్నేహితుడు అతణ్ణి స్థానిక కూడికలలో బోధించమని ప్రోత్సహించాడు. ఇందులో 

మాథ్యూ కృతార్థుడు అయినందునను,

సువార్తను ప్రకటించాలన్న అతనిలోని లోతైన ఆసక్తిని అనేకులు దృష్టించినందునను దేవునివాక్య సత్యాలను బోధించేందుకు చెస్టర్ మరియు నాస్ట్ విచ్ నుండి మాత్రమేగాక, ఇంకను అనేక ప్రాంతాలనుండి అతనికి ఆహ్వానాలు రావడం ప్రారంభించాయి. ఇది దేవుని చిత్తమేననీ, దేవుడు తన పనికొరకు తనను సిద్ధ పరుస్తున్నాడనీ మాథ్యూ గ్రహించాడు. చివరిగా అతడు 1687 మే మాసంలో చెస్టర్ లోని ఒక సంఘానికి సంఘకాపరిగా బాధ్యతలను చేపట్టాడు. దేవుని వాక్యం బోధించడంలో ప్రయాస పడుతూ ... చెస్టర్ లో దేవునివాక్య సత్యాలను బోధిస్తూ 

మాథ్యూ ఇరవై ఐదు సంవత్సరాలు గడిపాడు. 

సంఘంలో జరిగే ఆదివారాల ఆరాధనలోను వారంలో జరిగే మరిరెండు వారకూడికలలోను బోధించడం మాత్రమేగాక, మిగతా రోజుల్లో ఇరుగుపొరుగు గ్రామాల్లోను చెస్టర్ కోటలోను కూడ మాథ్యూ దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఆ సంవత్సరాలలో అతడు చేసిన నమ్మకమైన పరిచర్య ఆ ప్రాంతంలో ఐశ్వర్యవంతమైన ఆత్మీయ ఆశీర్వాదపు వర్షాలను కురిపించింది. ఫలితంగా దేవుడు అనేక ఇతర ప్రాంతాలలో 

మాథ్యూ పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరిచాడు. రెహ్యామ్ మరియు బీస్టన్లలో 

నెలసరి కూడికలు నిర్వహించేందుకు మాత్రమేగాక, అనేక ఇతర పట్టణాలలోను లండన్ నగరంలోను కూడ దేవుని వాక్యాన్ని 

బోధించేందుకు అతడు ఆహ్వానించబడ్డాడు. ఈలోగా అతడు కాపరిగా పనిచేస్తోన్న చెస్టర్ లోని సంఘము గొప్పగా అభివృద్ధి చెందడంతో 1699లో సువిశాలమైన మరొక నూతన భవనము అక్కడ నిర్మించవలసిన అవసరత ఏర్పడింది. 

ఇలా మాథ్యూ హెన్రీ తన పరిచర్యలో అవిరామంగా కొనసాగుతున్న సమయంలో అతని వ్యక్తిగత జీవితం గొప్ప విషాదానికి గురయింది. అతని వివాహం తర్వాత రెండు సంవత్సరాలకు అతని భార్య అయిన క్యాథరిన్ తన ప్రసవసమయంలో మరణించింది. ఆతర్వాత అతడు 1690లో మేరీ అనే స్త్రీని తిరిగి వివాహం చేసుకొన్నప్పటికీ, ఏడు www.gospel needs.com 

సంవత్సరాల వ్యవధిలో వారు తమ ముగ్గురు బిడ్డలను కోల్పోయారు. ఈ క్రమానుభవాల న్నిటిలో మాథ్యూ దేవుణ్ణి ఎక్కడా నిందించలేదు. ఎందుకంటే, “ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇస్తాడు తిరిగి తీసుకొంటాడు” అని అతడు ఎరిగివున్నాడు కాబట్టి. అంతేకాదు, తన దుఃఖసమయాలు తన పరిచర్యకు ఆటంకం కలిగించేందుకు అతడు ఎన్నడూ అనుమతించలేదు. ఎందుకంటే, “విత్తువాని ఏడుపు అతడు పొలంలో విత్తడాన్ని ఆటంక పరచకూడదు” అని అతడు విశ్వసించాడు కాబట్టి. కాబట్టి అతడు ప్రయాసతో కూడిన తన పరిచర్యా జీవితంలో సుదూర తీరాలకు పయనించాడు. 

మరణము వరకు నమ్మకంగా ... 

1704వ సంవత్సరం చివర్లో మాథ్యూ నలభై రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు, తన గత పరిచర్యలో తాను బోధించేందుకు తయారుచేసుకొన్న తన వ్రాతప్రతులను అతడు బయటకు తీసాడు. వాటన్నిటితో అతడు బైబిలు వ్యాఖ్యానాన్ని వ్రాయడం ప్రారంభించాడు. తాను బాలుడుగా ఉన్నప్పుడే అతడు లాటిన్, హెబ్రీ, ఫ్రెంచ్ మొదలైన భాషలలో ప్రావీణ్యత సంపాదించాడు. బాల్యం నుండే అతడు దేవునివాక్యాన్ని క్షుణ్ణంగా పఠించివుండటం చేతను, తన సుదీర్ఘ పరిచర్యాకాలంలో అతడు 

దానిని విశేషంగా బోధించివుంటం చేతను, దేవుని ఆత్మ అతణ్ణి నడిపించడం చేతను అతడు ఆ బైబిలు వ్యాఖ్యానాన్ని విపులంగాను అందరికీ అర్థమయ్యే విధంగాను వ్రాయగలిగాడు. అలా అతడు ఆ వ్యాఖ్యానాన్ని వ్రాయడం 

ప్రారంభించి, పదేళ్ళ వ్యవధి లో పాతనిబంధనను మరియు క్రొత్త నిబంధన వ్యాఖ్యానాల వ్రాతపతులను పూర్తిచేసాడు. 

ఇలా అతడు ఇరవై ఐదేళ్ళపాటు చెస్టర్ లో పరిచర్య చేసిన తరువాత, 1712లో లండన్ లోని హాక్నీలోవున్న ఒక డి సెంటర్ల సంఘములో పనిచే సేందుకు వచ్చిన 

ఆహ్వానాన్ని అతడు అంగీకరించాడు. అతడు చెస్టర్ ను వదలి వెళ్ళడాన్ని ఎన్నడూ ఊహించలేదు, కాని లండనకు వెళ్ళాలన్న దేవుని నడిపింపుకు అతడు విధేయతతో లోబడ్డాడు. లండన్ లో అతని బోధలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మాథ్యూ అప్పుడప్పుడూ చెస్టర్‌కు వెళుతూ తన మునుపటి సంవుంలో కూడ బోధిస్తూవుండేవాడు. 1714లో చెస్టర్ లోను నాన్డ్ విచ్ లోను బోధించేందుకు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రక్రియలో అతడు ఒకరోజు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. 

మరుసటి రోజు అతడు లండనకు తిరిగొస్తున్న సమయంలో టర్పోర్లీ వద్ద తాను పయనిస్తోన్న గుఱ్ఱం పై నుండి క్రిందపడ్డాడు. తర్వాత అతడు అక్కడకు సమీపంలో ఉన్న ఒక క్రైస్తవ పరిచారకుని వద్దకు కొనిపోబడి చికిత్స చేయబడ్డాడు కాని, మరుసటి రోజు అతడు తన తుదిశ్వాస విడిచాడు. 

మాథ్యూ హెన్రీ తయారుచేసిన 'బైబిలు వ్యాఖ్యానము' యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొన్న అతని సహపరిచారకులు అది ప్రపంచ క్రైస్తవులకు అందుబాటులోనికి వచ్చునట్లుగా దానిని ముద్రించేందుకు నడుము 

బిగించారు. అనతికాలంలోనే అది ముద్రణను పూర్తిచేసుకొని, ప్రపంచ క్రైస్తవలోకానికి 

అందుబాటులోనికి వచ్చింది. వైట్ ఫీల్డ్ అనే భక్తుడు తన అనుదిన ధ్యానంలో భాగంగా మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానాన్ని క్రమంగా చదివేవాడు. దానిని క్రమంగా చదివి గొప్ప ఆత్మీయమేలు పొందిన డాడ్రిడ్జ్ అనే భక్తుడు ఇలా వ్రాసాడు: "బైబిలు వ్యాఖ్యానాలు వ్రాసిన వ్యాఖ్యాతల్లో బహుశా మాథ్యూ హెన్రీ ఒక్కడే దేవునివాక్య సత్యాలను అత్యంత విపులంగాను అందరికీ అర్థమయ్యే విధంగాను వ్రాసాడేమోనని నాకు అనిపిస్తోంది. 

దేవునివాక్య సత్యాలను సవివరంగా తెలుసుకోవాలని ఆశించే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడ మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానాన్ని తప్పక చదవాలి.” 

శాస్త్ర, సాంకేతిక ఆశీర్వాదాలు 

గుండుసూది మొదలుకొని రాకెట్ వరకు గల ఆవిష్కరణలను నూటికి 95 శాతం కనిపెట్టినవారు - బైబిల్ గ్రంథమును నమ్మిన వారే 

కొన్ని ఆవిష్కరణలు, వాటిని కనిపెట్టిన క్రైస్తవ 

శాస్త్రవేత్తల వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. 

జాన్ గూట్బెర్గ్ జర్మని 1455 2. గడియారము, బరోలోమ్యూన్మ్యా న్ ఇటలీ 1462 3. మైక్రోస్కోప్, జడ్. జాన్సన్ హాలెండ్ 1590 4. థర్మామీటర్, హన్స్ లిఫ్టర్ షే హాలెండ్ 1608 5. టెలీస్కోప్, గలీలియో గెలిలీ ఇటలీ 1993 6. క్లాక్ పెండ్యూలమ్, క్రిష్టియన్ హ్యూజన్స్ హాలెండ్ 1656 7. స్టీమ్ యింజన్, థామస్ సెవరి బ్రిటన్ 1698 8. మెషిన్ గన్, జేమ్స్ పుకుల్ బ్రిటన్ 1718 9. స్టీమ్ షిప్, జె.సి. పెరియర్ ఫ్రాన్స్ 1775 10. సబ్ మెరైన్, డేవిడ్ బుష్ నెల్ అమెరికా 1776 11. కంటి అద్దాలు, బెంజిమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా 1780 12. మరమగ్గము, కార్ట్రై ట్ బ్రిటన్ 1785 13. టెలిగ్రామ్, యమ్. లామండ్ ఫ్రాన్స్ 1787 14. పేరాచ్యూట్, ఎ.గార్నరిన్ ఫ్రాన్స్ 1797 15.బ్యాటరీ, అలెస్సాండ్రో ఓల్గా ఇటలీ 1800 16. టైప్ రైటర్, పెల్లి ర్రీ ఇటలీ 1808 

www.gospelneeds.com 

జాన్ వాకర్ బ్రిటన్ 1824 - 20. కుట్టుమిషన్, బర్తెలెమి తిమ్మోనియర్ ఫ్రాన్స్ 1829 21. డైనమో, హై లైట్ పిక్సీ ఫ్రాన్స్ 1832 22. గాల్వనో మీటర్, ఆండ్రీమేరి అంపియర్ ఫ్రాన్స్ 1832 23. ప్రొపెల్లర్ షిప్, ఫ్రాన్సిస్ స్మిత్ బ్రిటన్ 1837 24. సైకిల్, క్కి పాట్రిక్ మాక్మిలన్ బ్రిటన్ 1839-40 25. రబ్బర్ టైర్, థామస్ హాంకాక్ బ్రిటన్ 1846 26. లిఫ్ట్, ఎలీషా ఓటీన్ అమెరికా 1852 27. సెల్యులాయిడ్, అలెగ్జాండర్ పార్క్స్ బ్రిటన్ 1861 28. ఎలక్ట్రిక్ మోటార్, జెనోబీ గ్రామ్ బెల్జియం 1873 29. మైక్రోఫోన్, అలగ్జాండర్ గ్రాహమ్ బెల్ అమెరికా 1876 30. టెలిఫోన్, అలగ్జాండర్ గ్రాహమ్ బెల్ అమెరికా 1876 31. కార్బోరేటర్, గాట్ లిబ్ డెయిమ్ లెర్ జర్మనీ 1876 32. గ్రామ్ ఫోన్, థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా 1878 33. ఎలక్రిక్ బల్బు, థామస్ ఆల్వాఎడిసన్ అమెరికా 1879  www.gospelneeds.com 

66. నైలాన్, డా.వేలెస్ హెచ్ కేరోథెర్స్ అమెరికా 1937

67. పాశ్చరైజేషన్, లూయీస్ పాశ్చర్ ఫ్రాన్స్ 1867 

68. ఫోటోగ్రఫీ, జాన్ కార్బట్ అమెరికా 1888

69. పార్సిలీన్, సర్ ప్యాడిక్ చైనా 1851 70. రేయాన్, సర్ జోసఫ్ స్వేన్ బ్రిటన్ 1883 71. రిఫ్రిజిరేటర్, జేమ్స్ హరిసన్, అమెరికా 1850 72. రబ్బర్ (వల్కనైజ్డ్), ఛార్లెస్ గుడ్ ఇయర్ అమెరికా 1841 78. రూబిక్ క్యూబ్, ప్రొ.ఎమోర్యూబిక్ హంగేరి 1975 74. సెల్ఫస్టార్టర్, ఛార్సెల్ ఎఫ్.కెటెరింగ్ అమెరికా 1911 75. షిటర్బైన్, హన్సర్ సి.పార్సన్స్ బ్రిటన్ 1894 76. స్కై స్వేపర్, బేరన్ జెన్నీ అమెరికా 1882 77. స్లెడ్ రూల్, విలియం ఆట్రెడ్ బ్రిటన్ 1621 78. ట్యాంకర్ (యుద్ధ), సర్ఎర్నస్ట్ స్వింగ్ టన్ బ్రిటన్ 1914 79. టెలిగ్రాఫ్ కోడ్, సామ్యూల్ ఎఫ్ బి.మోర్స్ అమెరికా 1837 80. ట్రాన్స్ ఫార్మర్, మైఖేల్ ఫారడే బ్రిటన్ 1831 81. ట్రాన్సిస్టర్, బర్డీన్ షాక్ లే& బ్రస్ఎన్ అమెరికా 1948 82. వాటర్‌సెట్, జె.హర్రింగ్ టన్ బ్రిటన్ 1589 83. ఎలక్ట్రిక్ వెల్డింగ్, ఎలీషా థామస్ అమెరికా 1877 84. వీల్, సుమేరియన్ సివిలైజేషన్ క్రీ.పూ.3300 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

gospelneeds Gospel Needs is your one-stop shop for Telugu Christian resources. We offer uplifting devotional audiobooks, inspiring Bible stories, biographies of faith heroes, and daily devotionals to nourish your spiritual journey.